శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (08:19 IST)

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు గతంలో ఓసారి కరోనా వైరస్ సోకింది. ఇపుడు రెండోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొద్ది రోజులుగా చలి, జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా నిజ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ వచ్చింది. 
 
ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అదేసమయంలో ఈ మధ్యకాలంలో తనను కలిసినవారంతూ వీలైతే కరోనా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. కొన్నిరోజులుగా ఆయన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెల్సిందే.