1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (10:10 IST)

దేశంలో 20 వేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొత్త‌గా 18,132 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, ఆదివారం 21,563 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,93,478కి చేరింది. నిన్న‌ 193 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,782కి చేరింది.
 
ప్ర‌స్తుతం 2,27,347 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 95,19,84,373 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజులో 10,691 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 85 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.
 
అలాగే, తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,506 కరోనా పరీక్షలు నిర్వహించగా, 162 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 11, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.  
 
అదేసమయంలో 214 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,887 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,722 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,235 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,930కి పెరిగింది.