ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 జులై 2020 (22:08 IST)

వ్యాక్సిన్ సృష్టించడానికి ఎక్కువ సమయం ఎందుకు? కరోనావైరస్ విషయంలో ఏం జరుగుతుంది?

వ్యాక్సిన్ అనేది చాలా దశలతో కూడిన క్లిష్టమైన ప్రక్రియ. అవసరమైన పరీక్షలు మరియు కఠినమైన ప్రక్రియలకు లోనయ్యే వ్యాక్సిన్ రూపకల్పన, మానవ వినియోగానికి ఇది సురక్షితం అని నిర్ధారించే ప్రక్రియ 10 నుండి 15 సంవత్సరాల దాకా పడుతుంది. COVID-19 పై ప్రపంచం దృష్టి సారించడంతో, ప్రభుత్వాలు 18 నెలల సూపర్-షార్ట్ టైమ్‌లైన్‌లో వ్యాక్సిన్‌ను పొందడానికి వేగంగా ట్రాక్ చేసిన అనుమతులు, షరతులతో కలిగిన నిబంధనలను కలిగి ఉన్నాయి.
 
మొదటి దశలో వ్యాధికారకాన్ని కనుగొని యాంటిజెన్లను తీస్తారు. కోవిడ్ విషయంలో జనవరి 2020లో, చైనాలోని శాస్త్రవేత్తలు కరోనావైరస్ యొక్క జన్యు క్రమాన్ని ప్రచురించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు వైరస్‌ను బాగా అర్థం చేసుకోవడం సులభం చేశారు.
 
రెండవ దశలో టీకా అభ్యర్థులను గుర్తించడం. ప్రజలలో రోగనిరోధక శక్తిని రేకెత్తించడానికి ఉపయోగించే ఉత్తమ మార్గాన్ని నిర్ణయించడానికి లైవ్ వైరస్ అని కూడా పిలువబడే ఈ టీకా అభ్యర్థిపై పరిశోధకులు పరిశోధిస్తారు. 
 
ఇక మూడో దశలో ప్రీ-క్లినికల్ టెస్టింగ్ చేస్తారు. వ్యాక్సిన్ మానవులపై ఎలా పనిచేస్తుందో అంచనా వేయడానికి జంతువులపై పరీక్ష చేస్తారు. అప్పుడు వారు టీకాను తదనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు.
 
నాలుగవ దశలో క్లినికల్ ట్రయల్స్ వుంటాయి. మానవులపై పరీక్ష ప్రారంభమైనప్పుడు ఇది జరుగుతుంది. సాధారణంగా ఇవి మూడు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో భద్రతా పరీక్షలు చేస్తారు. భద్రతను తనిఖీ చేయడానికి, మోతాదుల పరిమాణాన్ని సర్దుబాటు చేయడానికి చిన్న, ఆరోగ్యకరమైన నమూనాపై పరీక్షలు చేస్తారు. ఈ దశ సుమారు 3 నుంచి 6 నెలలు పడుతుంది.
 
రెండో దశలో ట్రయల్స్ విస్తరిస్తాయి. వైరస్ బారినపడే లక్ష్య జనాభాపై సమర్థత కోసం పరీక్షించడానికి నమూనా పరిమాణాన్ని వందలాది మందికి పెంచడం. దీని అర్థం సాధారణంగా యాదృచ్ఛిక నమూనాలో పద్ధతి జరుగుతుంది, ఈ దశ సుమారు 2 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది.
 
మూడో దశలో సమర్థత ప్రయత్నాలు జరుగుతాయి. జనాభాలో వివిధ మార్పులకు వ్యతిరేకంగా పరీక్షించడానికి నమూనా పరిమాణాన్ని వేలాది మందికి పెంచడమన్నమాట. ఈ దశ సుమారు 2 నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుంది. COVID-19 కోసం, చాలా టీకాలు ప్రస్తుతం రెండు, మూడు దశల్లో వున్నాయి.
 
ఆ తర్వాత రెగ్యులేటరీ సమీక్ష చేస్తారు. ప్రభుత్వ నియంత్రణ సంస్థ వ్యాక్సిన్‌ను ఆమోదించాలి. భారీ ఉత్పత్తికి ఇది సురక్షితంగా ఉందో లేదో చూడాలి. ఈ ప్రక్రియకు సుమారు ఒకటి నుంచి రెండేళ్లు పడుతుంది. అయితే COVID పై ప్రపంచం దృష్టితో, నియంత్రణ మరియు లైసెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ స్పందనలు ఉన్నాయి.
 
వ్యాక్సిన్ ఉత్పత్తి దశకు చేరుకుంటుంది. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఖచ్చితమైన యంత్రాలు, ప్రయోగశాలలు, సిబ్బంది మరియు పరికరాలు వంటి ముఖ్యమైన ఉత్పాదక సామర్థ్యాలు అవసరం. నాణ్యతా నియంత్రణ అవసరం. కాబట్టి మొత్తంగా, మొత్తం ప్రక్రియ సాధారణంగా 6 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది, అయితే COVID-19 వ్యాక్సిన్ కోసం ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. అందుకే త్వరలోనే వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఆశగా చూస్తోంది.