శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: మంగళవారం, 21 జులై 2020 (17:38 IST)

అది లోపిస్తే కరోనావైరస్ ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండాలంటే..?

ఎండ తగలకుండా ఎప్పుడూ ఎసి గదుల్లో ఇంట్లోనే ఉంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి జీవనశైలి ఉన్న వారిలో డి విటమిన్ బాగా లోపిస్తుందట. కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువమంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నవారేనని మృతుల్లోను వారి సంఖ్యే అధికమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
సమృద్ధిగా డి విటమిన్ ఉన్న వారు కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నట్లు తేలింది. సూర్యరశ్మి తగలకుండా ఇళ్ళు, కార్యాలయాలకు పరిమితమయ్యే నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి విటమిన్ లోపం ఉందని పలు సర్వేల్లో తేలిందట.
 
అందుకే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా జీవించాలంటే ఖచ్చితంగా ఎండ తగిలే విధంగా చూసుకోవాలి. డి విటమిన్ సమృద్ధిగా లభిస్తే ఎలాంటి వైరస్‌లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.