సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 14 జులై 2020 (11:35 IST)

కరోనా విలయాన్ని ఎదుర్కోవడానికి “డి” విటమిన్ మాత్రలు?

కరోనా వైరస్ విలయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఇంతవరకు వేడి నీళ్ళను ముట్టని వారు కూడా సైతం ఉదయాన్నే కాచిన నీరు తాగుతున్నారు. వాటిలో పసుపు, నిమ్మరసం వంటి వాటిని చేర్చి మరింత శరీరానికి అందిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగా విటమిన్ డి వల్ల మరింత ప్రయోజనం ఉందని ప్రజలు నమ్ముతున్నారు.
 
వీటి కోసం పరుగులు తీస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడంలో ప్రాధాన్యం వహిస్తున్నారు. అందుకే వీటికి డిమాండు పెరిగింది. కరోనా తెచ్చిన సమస్య అంతాఇంతా కాదు. దీని బారి నుండి తమను తాము రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇందుకోసం విటమిన్ ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు.
 
గడిచిన రెండు నెలలుగా వీటి అమ్మకం ఊపందుకున్నాయి. కొంతమంది వైద్యులతో పాటు, సామాజిక మాధ్యమాల్లో కూడా కరోనాను ఎదుర్కోవాలంటే విటమిన్ మాత్రలు పుష్కలంగా తీసుకోవాలనే ప్రచారం సాగుతోంది. దీంతో రాష్ట్రంలో 25 వేలకు పైగా మందుల షాపులుంటే 70 శాతం షాపుల్లో విటమిన్ మాత్రలు కొరత ఉన్నట్లు తేలింది.