సిడ్నీ కేఫ్ ఘటన: ఆస్ట్రేలియాకు బీసీసీఐ సెక్యూరిటీ చీఫ్

sydn
Selvi| Last Updated: మంగళవారం, 16 డిశెంబరు 2014 (14:18 IST)
సిడ్నీలోని కేఫ్ ఘటన ప్రపంచాన్ని వణికిస్తోంది. సిడ్నీ కేఫ్‌లో ఇరాన్‌కు చెందిన ఓ మతగురువు కొందరు పౌరులను బందీలుగా పట్టుకున్న ఘటన పలు దేశాలను ఆందోళనలో పడేసింది. ముఖ్యంగా, భారత్‌కు చెందిన ఇద్దరు పౌరులు కూడా బందీల్లో ఉండడంతో ఎన్డీయే సర్కారు చురుగ్గా స్పందించింది. అటు, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో, బీసీసీఐ కూడా దీనిపై దృష్టి సారించింది.

ఈ క్రమంలో, భారత జట్టుకు కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు బీసీసీఐ భద్రత, అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవానీని ఆస్ట్రేలియా పంపుతున్నారు. ఈ రాత్రికి సవానీ ఆస్ట్రేలియా బయల్దేరతారని, ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఆయనకు వెంటనే వీసా మంజూరు చేసేందుకు అంగీకరించిందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మీడియాకు తెలిపారు.దీనిపై మరింత చదవండి :