1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 జనవరి 2016 (15:20 IST)

ప్రపంచ క్రికెట్‌లో ముంబై ఆటో డ్రైవర్ తనయుడి సంచలనం.. 1000 రన్స్.. నాటౌట్

ప్రపంచ క్రికెట్‌లో ముంబైకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమారుడు సంచలనం సృష్టించారు. ఆ యువ క్రికెటర్ పేరు ప్రణవ్‌ ధనవాడే. వయస్సు 15 యేళ్లు. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ (కళ్యాణఅ)లో కేసీ గాంధీ జట్టు తరపున బరిలోకి దిగిన ప్రణవ్‌ సోమవారం ఒక్కరోజే 652 పరుగులు సాధించి మైనర్‌ క్రికెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టించాడు. 
 
తన 652 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం బరిలోకి దిగిన ఈ బుడతడు.. మరింతగా రెచ్చిపోయి 1000 పరుగుల మైలురాయిని దాటి బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. తన అత్యద్భుత ఇన్నింగ్స్‌తో ప్రణవ్‌ ప్రపంచ క్రికెట్‌లో అన్ని విభాగాల్లో ఉన్న బ్యాటింగ్‌ రికార్డులన్నింటినీ తిరగరాశాడు. 1899లో ఆర్థర్‌ కొలిన్స్‌ చేసిన 628 పరుగులే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరుగా రికార్డులో ఉంది. ప్రణవ్‌ మారథాన్‌ ఇన్నింగ్స్‌తో 116 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. క్రికెట్ ప్రపంచంలో ప్రణబ్ ధనవాడే నెలకొల్పిన రికార్డుపై మాస్టర్ బ్లాస్టర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.