శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (13:10 IST)

బుమ్రా, సంజన సూపర్ పిక్.. ఆ శుభాకాంక్షలు అలా అనిపించాయ్!

Bumrah
టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. బుమ్రా మార్చి 15న గోవా వేదికగా స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుకకు కేవలం సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి కొద్ది క్షణాలలో వైరల్‌గా మారాయి.
 
కొత్త జీవితం ఆరంభించిన బుమ్రా, సంజనాకు నెటిజన్స్, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వెల్లువలా వస్తున్న శుభాకాంక్షలకు బుమ్రా కృతజ్ఞతలు తెలియజేశాడు.
 
అంతేగాకుండా శ్రీమతితో స్టైలిష్‌గా దిగిన పిక్స్ షేర్ చేస్తూ .. కొద్ది రోజులుగా మాకు వస్తున్న విషెస్ మ్యాజికల్‌గా అనిపించాయి. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు అని బుమ్రా తన కామెంట్ సెక్షన్‌లో రాశారు.