1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (16:28 IST)

ఎట్టకేలకు ఓ ఇంటివాడినయ్యా : ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేషన్‌ను పెళ్ళాడాడు. ఈ విషయాన్ని సోమవారం మధ్యాహ్నం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. గోవా వేదికగా ఈ వివాహం జరిగినట్టు సమాచారం.
 
"మీరు విలువైన వారు అనిపిస్తే ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ మార్గాన్ని నిర్దేశిస్తుంది. మేం ఈ రోజు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. మా జీవితాల్లోని సంతోషకరమైన రోజులలో ఈ రోజు ఒకటి. మా పెళ్లి వార్తను, మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము" అంటూ బుమ్రా, సంజన తమ సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొన్నారు. దీంతో పలువురు నెటిజన్లు బుమ్రాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.