శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (12:09 IST)

అయ్యో మయాంక్‌.. బుమ్రా భార్య సంజయ్‌ బంగర్‌ కాదు..

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మాజీ మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ సంజనా గణేశన్‌ల వివాహం గోవాలో సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టీమిండియా టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌.. బుమ్రాకు కంగ్రాట్స్‌ చెబుతూ పోస్టు చేసిన కామెంట్‌ అందరిలో నవ్వులు పూయించింది. అసలు మయాంక్‌ పోస్టు చేసిన ఆ కామెంట్‌ ఏంటో చూసి మీరు నవ్వుకోండి..
 
బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపిన మయాంక్‌ అగర్వాల్‌ పొరపాటున అతని భార్య సంజనా గణేశన్‌కు బదులుగా.. టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌ చేశాడు. 'కంగ్రాట్స్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. సంజరు బంగర్‌! మీ వైవాహిక జీవితం బాగుండాలని, నిత్యం సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా' అని ట్వీట్‌ చేశాడు.
 
మయాంక్‌ చేసిన ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌ అయింది. 'అయ్యో మయాంక్‌.. బుమ్రా భార్య సంజయ్‌ బంగర్‌ కాదు' అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే విషయం తెలుసుకున్న మయాంక్‌ తన ట్వీట్‌ను వెంటనే డిలీట్‌ చేశాడు.