బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:00 IST)

100 శాతం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తాం.. బాబర్

kohli -babar
ఆసియా కప్ సిరీస్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిసిన నేపథ్యంలో.. ప్రస్తుతం సూపర్ 4 రౌండ్లు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. 6వ తేదీన జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ ఓడించింది. 
 
ఈ క్రమంలో శ్రీలంకలోని కొలంబో వేదికగా 10న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ గురించి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ మాట్లాడుతూ.. "మేం ఎప్పుడూ పెద్ద ఆటకు సిద్ధంగా ఉంటాం. 100 శాతం ప్రదర్శన ఇచ్చి భారత్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. ఈసారి విజయం పాకిస్థాన్‌దే.. అంటూ ధీమా వ్యక్తం చేశాడు.
 
మ్యాచ్ జరిగే రోజు కొలంబోలో వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.