గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (19:41 IST)

ప్రపంచ క్రికెట్‌లో వెరైటీ అవుట్..?

ప్రపంచ క్రికెట్‌లో విభిన్నమైన అవుట్ నమోదైంది. క్రికెట్‌లో బోల్ట్, క్యాచ్, స్టంపింగ్, రనౌట్, ఎల్‌బీడబ్ల్యూ, హిట్ వికెట్ అనే పలు రకాల్లో వికెట్లు నేలకూల్చేందుకు బౌలర్లు బౌలింగ్ చేస్తారు. అయితే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా వ్యత్యాసమైన అవుట్ నమోదైంది. 
 
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మహిళా క్రికెట్ మ్యాచ్‌లో కివీస్ జట్టుకు చెందిన బెర్కిన్స్ కొట్టిన బంతి.. రన్నర్‌గా నిలిచిన వ్యక్తి బ్యాట్‌కు తగిలి.. అది క్యాచ్‌గా మారింది. థర్డ్ అంపైర్ ఈ వికెట్‌ను అవుట్‌గా ప్రకటించారు. 
 
ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి వికెట్ ఇంతవరకు నేలకూలలేదు. ఒక బ్యాట్స్‌మెన్ లేదా వుమెన్ అవుట్ కావడం ఇదే తొలిసారి. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 166 పరుగుల భారీ తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.