సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (14:06 IST)

కంగారూలను కంగారు పెట్టిస్తున్న భారత బౌలర్లు.. బుమ్రా అదుర్స్

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. సొంతగడ్డపై ఇప్పటికే టీ20 సిరీస్‌ కోల్పోయిన భారత జట్టు.. ఎలాగైనా ఈ సిరీస్‌ నెగ్గాలని చూస్తోంది. మరోవైపు పొట్టి సిరీస్‌ గెలిచి జోరు మీదున్న ఆసీస్‌ వన్డే సిరీస్‌ సొంతం చేసుకుని భారత టూర్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి వెళ్లాలనుకుంటోంది. 
 
ఈ మ్యాచ్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, బుమ్రా కొత్త బంతితో చెలరేగిపోతున్నారు. షమీ తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్ ఓవర్ వేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసేందుకు వచ్చిన బుమ్రా కట్టుదిట్టంగా బంతులు వేస్తూ.. ఆసీస్ కెప్టెన్‌ అరోన్ ఫించ్‌ను మూడో బంతికే అవుట్ చేశాడు. 
 
బుమ్రా బంతిని ఫించ్ షాట్ ఆడబోగా బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయి ధోనీ చేతిలో పడింది. దీంతో ఆసీస్ సున్నా పరుగులకే తొలి వికెట్ నష్టపోయింది.ఇంకా కంగారూ జట్టును టీమిండియా బౌలర్లు కంగారు పెట్టిస్తున్నారు. దీంతో ఆ జట్టు ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తోంది.