సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:17 IST)

ప్రపంచకప్‌లో భారత జట్టుకు బుమ్రానే పెద్ద ఆస్తి.. సచిన్ టెండూల్కర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. పేస్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్లను తిప్పలు పెడుతున్న బుమ్రానే.. ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌లో ప్రత్యర్థి జట్లకు అతిపెద్ద సవాల్ అంటూ కొనియాడాడు.


ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. బౌలింగ్ అటాక్‌లో ఆరితేరిపోయాడని.. సచిన్ మెచ్చుకున్నాడు. అన్నీ ఫార్మాట్లలో రాణిస్తున్న సచిన్.. ప్రపంచకప్‌లో భారత జట్టుకు పెద్ద ఆస్తి అవుతాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదని చెప్పాడు. 
 
అంతకుముందు బుమ్రాను పాక్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కొనియాడాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో యార్కర్లు సంధించడంలో బుమ్రాను మించిన వారు లేరన్నాడు. వన్డేల్లో కాకుండా టెస్టుల్లోనూ నిరంతరం యార్కర్లు వేయగలడని.. అప్పట్లో తాను, వకార్, యూనిస్ ఇలా వేశాం. పాక్ నుంచి తాను భారత్ నుంచి బుమ్రా టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి వచ్చిన వాళ్లమేనని వసీమ్ అక్రమ్ చెప్పుకొచ్చాడు.