సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 28 డిశెంబరు 2018 (12:06 IST)

ఆసీస్‌కు చుక్కలు చూపించిన బుమ్రా... 39 ఏళ్ల రికార్డ్ బద్ధలు.. ఏంటది?

నిన్న న్యూజీలాండ్ ప్లేయర్ ట్రెట్ బౌల్ట్ వరుసగా 6 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టిస్తే ఇపుడు టీమిండియా పేసర్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో బుమ్రా 39 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు. టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 
 
కాగా మూడో టెస్టులో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో స్పిన్నర్ దిలీప్ దోషి పేరిట 40 వికెట్లు పడగొట్టిన చరిత్ర వుంది. ఇది 1979 నాటిది. ఇప్పుడు బుమ్రా ఆ చరిత్రను బద్ధలు కొట్టి ఇప్పటివరకూ 45 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.