శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (10:57 IST)

బౌలింగ్ చేసే ప్రతీసారి రక్తపు వాంతి చేసుకుంటున్నా- జాన్ హేస్టింగ్స్

ఆస్ట్రేలియా బౌలర్ జాన్ హేస్టింగ్స్ రక్తం వాంతులు చేసుకున్నాడు. అతను రక్తం వాంతులు చేసుకునేంత అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది

ఆస్ట్రేలియా బౌలర్ జాన్ హేస్టింగ్స్ రక్తం వాంతులు చేసుకున్నాడు. అతను రక్తం వాంతులు చేసుకునేంత అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది. దీంతో హేస్టింగ్స్ క్రీడా జీవితం ప్రమాదంలో పడింది. ఊపిరితిత్తుల్లో తలెత్తిన సమస్య వల్ల బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతుండటంతో ఆయన కెరీర్ డైలమాలో పడింది. 
 
ఊపిరితిత్తుల నుంచి రక్తం ఎగజిమ్మి దగ్గినప్పుడు.. అది నోటి ద్వారా బయటకు వస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యులు నిర్ధారించట్లేదు. వారి మౌనం తనలో భయాన్ని పెంచుతోంది. ఇకపై తాను బౌలింగ్ చేస్తానో లేదోనని హేస్టింగ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బౌలింగ్ చేసే ప్రతీసారి రక్తపు వాంతి చేసుకుంటున్నానని వాపోయాడు. 
 
కేవలం బౌలింగ్ చేస్తేనే పరిగెత్తితే కాదు. తాను బాక్సింగ్, రోయింగ్ కూడా చేయగలననని.. బరువులు ఎత్తగలనని.. కానీ కేవలం బౌలింగ్‌కు దిగినప్పుడే ఇలా జరుగుతోందని హేస్టింగ్స్ చెప్పుకొచ్చాడు.