సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (09:25 IST)

ఒక్క టెస్ట్ సిరీస్‌లో ఓడితే కెప్టెన్సీకి రాజీనామా చేయాలా : బంగ్లా కెప్టెన్ ప్రశ్న

ఒక్క సిరీస్‌లో ఓడినంత మాత్రానా కెప్టెన్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ రహీం ప్రశ్నించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసి

ఒక్క సిరీస్‌లో ఓడినంత మాత్రానా కెప్టెన్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ రహీం ప్రశ్నించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 2-0 తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది.
 
దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ రహీంపై విమర్శల వర్షం కురుస్తోంది. కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన ముష్పికర్.. కెప్టెన్ పదవి నుంచి తప్పుకోనని, తనను రాజీనామా చేయమని బంగ్లా క్రికెట్ బోర్డు కోరలేదని అన్నాడు. 
 
తమ జట్టు సభ్యుల ఆటతీరుపై వివరణ ఇవ్వాల్సిన అవసరముందని తాను అనుకోవడం లేదని చెప్పాడు. కాగా, మొదటి టెస్టులో 333 పరుగులు, రెండో టెస్టులో ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. టెస్ట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి కూడా ఇదే కావడం గమనార్హం.