సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (15:00 IST)

సారా టెండూల్కర్‌ను కిడ్నాప్ చేస్తా.. పెళ్లి కూడా చేసుకుంటా: బెదిరించిన వ్యక్తి అరెస్ట్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాకు కూడా వేధింపులు తప్పలేదు. సారాను కిడ్నాప్ చేస్తానంటూ ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సచిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాకు కూడా వేధింపులు తప్పలేదు. సారాను కిడ్నాప్ చేస్తానంటూ ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సచిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంగతకుడిని అరెస్ట్ చేశారు. 
 
విచారణలో అతను ఆవారాగా తిరిగే వాడని.. సచిన్ కుమార్తెను టీవీల్లో చూసి ఇష్టపడ్డాడని చెప్పారు. ఆపై సచిన్ ఇంటి ఫోన్ నెంబర్ కనుక్కుని గత నెల చివరి వారంలో మాస్టర్ బ్లాస్టర్ ఇంటికి ఫోన్ చేసి సారాను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు.
 
ఇంకా ఆమెను పెళ్లి కూడా చేసుకుంటానంటూ నిందితుడు బెదిరించాడని పోలీసులు చెప్పారు. అరెస్టయిన వ్యక్తి పేరు హాల్డియా అని అతడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. అతడో మానసిక రోగి అని.. పెయింటర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.