మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (16:41 IST)

మిస్టర్ డిఫెండబుల్‌, దివాల్‌.. ద్రవిడ్ అరుదైన రికార్డ్.. ఏంటో తెలుసా?

మిస్టర్ డిఫెండబుల్‌, దివాల్‌గా పేరున్న రాహుల్ ద్రవిడ్.. అత్యుత్తమ ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ పదివేల పరుగుల పూర్తిచేసిన బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా జట్టుకు సేవలందించిన క్రికెటర్. ఏ ఫార్మాట్‌లోనైనా ఒకేలా ఆడగలిగే సత్తాగల వాడని నిరూపించాడు. అతని ఆటతీరు యువ క్రికెటర్లకు మార్గదర్శకం. 
 
ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ అరుదైన రికార్డును బీసీసీఐ ట్వీట్ చేసింది. క్రికెటర్‌గా రిటైర్ అయిన ఇన్నేళ్ల తర్వాత.. ఈ రికార్డ్ ఏంటని అనుకోవచ్చు. కానీ టెస్టుల్లో 30వేలకు పైగా బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ ద్రవిడ్ నిలిచాడు. 
 
క్రికెట్ కెరీర్‌లో మొత్తం 31258 బంతులను ఎదుర్కొన్నాడు. చివరికి ఈ రికార్డును క్రికెట్ దేవుడు, క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్‌ కూడా ఈ రికార్డును బద్ధలు కొట్టలేకపోయారు. 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌లో సచిన్ 29,437 బంతులు మాత్రమే ఎదుర్కోవడం గమనార్హం.