మాజీ క్రికెటర్ భార్యపై కేసు.. ఎందుకో తెలుసా?

మాజీ క్రికెటర్ వినోంద్ కాంబ్లీ సతీమణిపై పోలీసు కేసు నమోదైంది. బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ఓ ప్రోగ్రా

vinod kabli
pnr| Last Updated: సోమవారం, 2 జులై 2018 (11:28 IST)
మాజీ క్రికెటర్ వినోంద్ కాంబ్లీ సతీమణిపై పోలీసు కేసు నమోదైంది. బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ఓ ప్రోగ్రామ్ జరిగింది. దీనికి మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీతోపాటు అతని ఆండ్రియా కూడా హాజరయ్యారు.
 
ఇదే కార్యక్రమానికి బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ, అతని తండ్రి కూడా హాజరయ్యారు. ఓ అంశంపై వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా.. అంకిత్‌తో వాదనకు దిగారు. మాట మాట పెరిగింది. సహనం కోల్పోయిన ఆండ్రియా.. అంకిత్‌పై చేయిచేసుకుంది. దీంతో ఆయన ఆండ్రియాపై కేసు పెట్టారు.
 
ఈ వ్యవహారంపై వినోంద్ కాంబ్లీ కూడా స్పందించారు. ఆండ్రియా చేయి పట్టుకున్నాడని.. అసభ్యకరంగా ప్రవర్తించటంతోనే చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మొదటగా అంకిత్ తండ్రి నుంచి ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత చదవండి :