శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (21:05 IST)

బీసీసీఐకు షాకిచ్చిన కాంపిటిషన్ కమిషన్.. ఎందుకు?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంపిటిషన్ కమిషన్ రూ.52.24 కోట్ల జరిమానా విధించింది.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంపిటిషన్ కమిషన్ రూ.52.24 కోట్ల జరిమానా విధించింది.
 
ఐపీఎల్ మీడియా హక్కుల అగ్రిమెంట్ ఓ అభ్యంతర క్లాజ్‌ను బోర్డు కావాలనే ఉంచిందని... ఇది అటు బిడ్డర్లు, ఇటు బీసీసీఐ ఆర్థిక ప్రయోజనాలకు రక్షణ కల్పించేలా ఉందని కాంపిటిషన్ కమిషన్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి 44 పేజీల ఆర్డర్ కాపీని బోర్డుకు పంపించింది.
 
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటు బోర్డు టర్నోవర్‌ను లెక్కలోకి తీసుకొని అందులో 4.48 శాతం అంటే రూ.52.24 కోట్లను జరిమానాగా విధించింది. కాంపిటిషన్ కమిషన్ బోర్డుకు జరిమానా విధించడం ఇది తొలిసారి కావడం గమనార్హం.