శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (13:43 IST)

కరోనా క్రైసిస్ : ఆ నాలుగు సంస్థలకు రోహిత్ విరాళాలు

దేశం కరోనా కోరల్లో చిక్కుకుంది. దీని నుంచి బయటపడేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ కష్ట సమయంలో పేదలను, కరోనా బాధితులను ఆదుకునేందుకు వీలుగా అనేక మంది దాతలు తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందులో భారత క్రికెటర్ రోహిత్ శర్మ కూడా చేఱారు. ఈయన మొత్తం రూ.80 లక్షలను విరాళంగా ప్రకటించాడు. 
 
ఈ మొత్తంలో పీఎం కేర్స్ నిధికి రూ.45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు రూ.5 లక్షల చొప్పున అందించినట్టు మంగళవారం రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 
 
దేశం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలని, ఇందుకోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రోహిత్ గుర్తు చేశాడు. కరోనాపై యుద్ధంలో ప్రధాని మోడీతో పాటు నాయకులకు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చాడు. 
 
వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు విరాళమిచ్చి.. వీధి శునకాల సంక్షేమానికి హిట్​మ్యాన్ తోడ్పాటునందించాడు. జంతు ప్రేమికుడిగా మరోసారి నిరూపించుకున్నాడు.
 
కాగా, ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ దంపతులు, ఓపెనర్​ ధవన్​, రహానే, రైనాతో పాటు మరికొందరు క్రికెటర్లు విరాళాలు ఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల విలువైన బియ్యాన్ని అవసరార్థులకు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.