ఆదివారం, 17 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (16:50 IST)

క్రికెట్ వైపు దృష్టిపెట్టిన జపాన్.. త్వరలో ఈస్ట్ ఏసియా కప్.. 15 ఏళ్లే అర్హత!: కెప్టెన్

బేస్ బాల్ కింగ్ అయిన జపాన్ ప్రస్తుతం క్రికెట్ వైపు దృష్టి మరల్చింది. క్రికెట్‌కు జపాన్‌లో ప్రజాదరణ లభిస్తున్న నేపథ్యంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు జాతీయ జట్టు ఎంపికలో ప్రదర్

బేస్ బాల్ కింగ్ అయిన జపాన్ ప్రస్తుతం క్రికెట్ వైపు దృష్టి మరల్చింది. క్రికెట్‌కు జపాన్‌లో ప్రజాదరణ లభిస్తున్న నేపథ్యంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది.

ఈ మేరకు జాతీయ జట్టు ఎంపికలో ప్రదర్శన ఆధారంగా నిజాయితీ వ్యవహరిస్తామని జపాన్ కెప్టెన్ తెలిపాడు. జపాన్‌లో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో తమ జట్టు పోటీపడాలనేదే తమ లక్ష్యమని కెప్టెన్ ఆకాంక్షించాడు. 
 
జూనియర్ ఆటగాళ్ల శిక్షణ మెరుగ్గా సాగుతున్న తరుణంలో.. ఇప్పటిదాకా 3000 మంది క్రికెటర్లు.. 200పైగా జట్లు ఉన్నట్లు అంచనా వేసిన కెప్టెన్‌ గత నవంబరులోనే అత్యుత్తమ ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం కూడా ఏర్పాటైనట్లు వివరించాడు. 
 
జపాన్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించుకునే క్రికెటర్ల పరిమిత వయసు, అర్హత 15 సంవత్సరాలేనని, తాము క్రికెట్లో ఎంతగా అభివృద్ది చెందామో తెలిపేందుకు ఇదే నిదర్శనమని జపాన్ కెప్టెన్ వెల్లడించారు. అంతేగాకుండా భవిష్యత్తులో జపాన్, చైనా, సౌత్ కొరియా, హంకాంగ్ నుండి చైనీస్ డ్రాగన్‌లతో కొత్తగా ఏర్పాటయ్యే స్టేడియంలో ఈస్ట్‌ ఏసియా కప్ నిర్వహిస్తామని తెలిపాడు.