ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (18:03 IST)

భారత క్రికెట్ జట్టు బౌలర్‌పై దాడి.. ఎక్కడ?

భారత క్రికెట్ జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న మహ్మద్ షమీపై దాడి జరిగింది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అతని నివాసం వద్దే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి శనివారం సాయంత్రం జరిగింది.

భారత క్రికెట్ జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న మహ్మద్ షమీపై దాడి జరిగింది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అతని నివాసం వద్దే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడి శనివారం సాయంత్రం జరిగింది. 
 
ష‌మి త‌న కారులో ఇంటికి వ‌చ్చిన స‌మ‌యంలో.. వాచ్‌మ‌న్ గేట్ ఓపెన్ చేసేవ‌ర‌కు రోడ్డుపై కారు ఆపాడు. ఆ స‌మ‌యంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు షమీతో రోడ్డుపై కారు ఎందుకు ఆపావంటూ వాగ్వాదానికి దిగి దాడులకు దిగారు. ఈ దాడిని అడ్డుకోవ‌డానికి వ‌చ్చిన వాచ్‌మ‌న్‌పై కూడా వారు చేయి చేసుకున్నారు. 
 
దీనిపై షమీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు... ఈ దాటి ఘటనంతా బిల్డింగ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. దీని ఆధారంగా జ‌యంత స‌ర్కార్‌, స్వ‌రూప్ స‌ర్కార్‌, శివ ప్రామానిక్ అనే ఆ ముగ్గురు యువ‌కులను పోలీసులు అరెస్ట్ చేశారు.