శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (11:35 IST)

లార్డ్స్ వన్డే : రూట్ సెంచరీ.. భారత్ చిత్తు.. ఇంగ్లండ్ గెలుపు

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ రూట్స్ (113) అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో రాయ్ 40, బెయి

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ రూట్స్ (113) అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో రాయ్ 40, బెయిర్ స్టో 38, మోర్గాన్ 53, విల్లే 50 చొప్పున పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ జట్టు 322 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ ముంగిట 323 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
 
ఆ తర్వాత 323 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్‌లో చతికిలపడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 15, శిఖర్ ధావన్ 36 రన్స్ చేసి పెవిలియన్ దారిపట్టారు. కోహ్లీ 45, రైనా 46 రన్స్ చేశారు. 
 
50 ఓవర్లు ఆడిన భారత్ 236 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 86 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో 1-1 పాయింట్లతో ఇరు జట్లూ సమఉజ్జీలుగా నిలిచాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే మ్యాచ్ ఈనెల 17వ తేదీన లీడ్స్‌లో జరుగనుంది.