శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 13 జులై 2018 (20:53 IST)

నేను ప్రధానిని ప్రేమిస్తున్నా - మాధవీలత

చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు సినీ పరిశ్రమలో మాధవీలతకు ప్రత్యేకత ఉంది. ఈమధ్య హైదరాబాద్‌లో జరిగిన కొన్ని పరిణామాలపై తీవ్రంగా స్పందించారు మాధవీలత. ఆమె ఏ రాజకీయ పార్టీలో లేకున్నా బిజెపి గురించే ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడుతుంటారు. గత కొన్నిరోజులుగా మ

చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు సినీ పరిశ్రమలో మాధవీలతకు ప్రత్యేకత ఉంది. ఈమధ్య హైదరాబాద్‌లో జరిగిన కొన్ని పరిణామాలపై తీవ్రంగా స్పందించారు మాధవీలత. ఆమె ఏ రాజకీయ పార్టీలో లేకున్నా బిజెపి గురించే ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడుతుంటారు. గత కొన్నిరోజులుగా మాధవీలత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు సినీపరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాలామంది రాజకీయ నేతలు వ్యతిరేకిస్తున్నారు. మోడీ ప్రవేశపెట్టిన పథకాలు బాగా లేవంటూ రాద్దాంతం చేసేస్తున్నారు. అస్సలు ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకర్థం కావడం లేదు. జిఎస్టీ, నోట్ల రద్దు రెండూ కూడా దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చాయి. అందుకే నేను ప్రధానిని ప్రేమిస్తున్నాను. నా తండ్రి సమానులు ప్రధాని. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నరేంద్ర మోడీ గ్రేట్ అంటోంది మాధవీలత.