టెస్టు క్రికెట్లో అదుర్స్!: 400 వికెట్ల క్లబ్లో చేరిన డేల్ స్టెయిన్..!
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మరో బౌలర్ 400 వికెట్ల క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రికార్డు సాధించాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను పెవిలియన్‌కు పంపించడం ద్వారా స్టెయిన్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో 400 వికెట్ల క్లబ్లో చేరిన రెండో సఫారీ బౌలర్‌గా స్టెయిన్ అవతరించాడు. 80వ టెస్టులో స్టెయిన్ ఈ ఫీట్ నెలకొల్పాడు.
అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ (421) ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం టెస్ట్ కెరీర్ కొనసాగిస్తున్న ఆటగాళ్లలో హర్భజన్ (ఇండియా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్)లు కూడా 400 వికెట్ల క్లబ్లో ఉండటం గమనార్హం. 400 వికెట్లు సాధించిన 13వ ఆటగాడిగా స్టెయిన్ రికార్డుకెక్కాడు.