శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 23 మే 2019 (16:02 IST)

దుమ్ముదులిపిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజవర్గాల్లో బీజేపీ జయభేరి మోగించింది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఈస్ట్‌ఢిల్లీ స్థానం నుంచి తొలిసారి బీజేపీ తరపున పోటీ చేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఘన విజయం సాధించారు. ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ మినహా గంభీర్‌కు ఎవరూ పోటీని ఇవ్వలేకపోయారు. 
 
ఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి బరిలో నిలిచిన అతిషీ మూడో స్థానంలో నిలిచారు. 2014లో నరేంద్రమోదీ హవాతో తొలిసారి ఏడు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ సత్తాచాటింది. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఓటమిపాలయ్యారు.