బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (17:34 IST)

ప్రేమికుల దినోత్సవం : భార్యను మళ్లీ పెళ్లాడనున్న భారత క్రికెటర్

pandya couple
ఓ బిడ్డకు జన్మనిచ్చిన భార్యను భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోమారు పెళ్లి చేసుకోనున్నాడు. నిజానికి హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి గత లాక్డౌన్ సమయంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ మగబిడ్డ కూడా కలిగాడు. అయితే, వీరిద్దరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మరోమారు పెళ్ళి చేసుకోవాలని హార్దిక్ పాండ్యా దంపతులు భావించారు. 
 
వారు అనుకున్నదే తడవుగా ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీన వీరు మళ్లీ పెళ్లి చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్లి వేడుకలు రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఉదయపూర్ కోట వేదికగా జరుగునున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలతో పాటు సంప్రదయాబద్దంగా వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.