సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (18:47 IST)

కఠినమైన షరతులు-ముగ్గురు సిస్టర్స్‌ను పెళ్లాడిన కెన్యా వ్యక్తి

3 sisters
3 sisters
కెన్యా వ్యక్తి  కఠినమైన షరతులతో ముగ్గురు సోదరీమణులను వివాహం చేసుకున్నాడు. ఈ రోజుల్లో, బహుభార్యత్వం చాలా అరుదు. సోదరీమణులు ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవడం విచిత్రం. అలాంటిది కెన్యాలో ఒక వ్యక్తి ముగ్గురు సోదరీమణులను వివాహం చేసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. సువార్త గానంలో వృత్తిని కొనసాగిస్తున్న కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు సోదరీమణులు కెన్యాకు చెందిన స్టీవో అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 
 
ప్రతి అమ్మాయికి తగినంత సమయం ఇవ్వడానికి అతను కఠినమైన షెడ్యూల్‌కు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు. సోమవారాలు మేరీకి, మంగళవారాలు కేట్‌కి, బుధవారాలు ఈవ్‌కి అని షెడ్యూల్ వేశాడు.