గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (23:09 IST)

ఓ ఇంటివాడైన అక్షర్ పటేల్.. మేహా పటేల్‌తో డుం డుం డుం

Axar Patel
Axar Patel
భారత క్రికెటర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. ఈమె డైటీషియన్ అండ్ న్యూట్రీషియనిస్ట్. వీరి వివాహం గురువారం సాంప్రదాయ గుజరాతీ పద్ధతి ప్రకారం జరిగింది. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు  
 
వారి వివాహాల కోసం, ఈ జంట సాంప్రదాయ ఎరుపు రంగుకు బదులుగా భారీగా ఎంబ్రాయిడరీ చేసిన తెల్లని దుస్తులు ఎంచుకున్నారు. భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ అయిన పటేల్ వేడుక నుండి ఎటువంటి ఫోటోలు లేదా వీడియోలను పంచుకోలేదు. అయితే ట్విట్టర్‌లోని అభిమానుల ఖాతాలు ఆయన పెళ్లి ఫోటోలు చాలానే కనిపించాయి. 
 
పటేల్ పెళ్లి కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, శ్రీలంకతో జరిగిన T20Iలు,  ODIలలో రాణించిన సంగతి తెలిసిందే.