శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (19:00 IST)

కావ్య మారన్, నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్రపోజల్ అలా వచ్చింది..

Kavya nayar
Kavya nayar
సౌతాఫ్రికాలో ఎస్ఏ20 మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ కు అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ ఇంటర్నెట్ సెన్సేషన్. అయితే కావ్యకు ఉన్న ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఇండియా దాటిపోయింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 మ్యాచ్ లో కావ్యకు ఓ అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఐపిఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ సోదర ఫ్రాంచైజీ అయిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ గురువారం  బోలాండ్ పార్క్ మైదానంలో పార్ల్ రాయల్స్ తో మ్యాచ్ ఆడింది.
 
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మంచి ఆరంభం లభించడంతో ఓ దశలో పార్ల్ రాయల్స్ స్కోరు 8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
 
'కావ్య మారన్, నన్ను పెళ్లి చేసుకుంటావా?' అనే ప్లకార్డు పట్టుకుని గుంపులో ఉన్న ఓ అభిమానిపై కెమెరా తిరిగింది. ఈ వీడియోను ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతోంది.