సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (12:23 IST)

ఐపీఎల్ 2023.. స్టంప్‌ పడలేదు.. సరిగ్గా చేసి ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది..

Harshal Patel
Harshal Patel
సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ (61), డుప్లెసిస్ (79), మ్యాక్స్‌వెల్ (59) పరుగులు చేశారు. 
 
కానీ లక్నో జట్టు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆర్సీబీ పేలవమైన బౌలింగ్ కారణంగా ఎక్కువ పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 213 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చివరి బంతికి హర్షల్ పటేల్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు రవి బిష్ణై క్రీజు వదిలి వెళ్లిపోయాడు. 
 
ఆపై హర్షల్ పటేల్ మాన్‌కట్ పద్ధతిలో అవుట్ కావడానికి స్టంప్‌లను కొట్టాడు. కానీ చేతిలో స్టంప్‌ పడలేదు. అతను సరిగ్గా చేసి ఉంటే, మ్యాచ్ డ్రాగా ముగిసేది. ఆ తర్వాత సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది. అతని పొరపాటు కారణంగా జట్టు విజయావకాశాన్ని కోల్పోయింది.