1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (20:21 IST)

భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ అలెర్ట్

భారత్‌లో ఐపీఎల్ 2023 జరుగుతోంది. భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐపీఎల్-16వ సీజన్ జరుగుతున్నందున బీసీసీఐ ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.  
 
గత 24 గంటల్లో, భారతదేశంలో 5335 మందికి కరోనా సోకింది. బీసీసీఐ-10 ఐపీఎల్ జట్లు, ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆటగాళ్లు, కోచ్‌లు మార్గదర్శకాలను పాటించాలని కూడా పేర్కొంది.
 
గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లు బయో-బబుల్ మోడ్‌లో నిర్వహించడం చూశాం. ప్రస్తుతం అలాంటి కఠినమైన నియమాలను అనుసరించకపోయినా ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.