సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (09:20 IST)

ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన శ్రేయాస్ అయ్యర్

ShreyasIyer
వెన్ను గాయంతో బాధపడుతున్న క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2023 సీజన్‌‍ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే, ఆయన వెన్ను నొప్పికి విదేశాల్లో చికిత్స చేయించుకోనున్నాడు. ఫలితంగా ఈ సీజన్ మొత్తానికి శ్రేయాస్ దూరమవుతాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయాస్ అయ్యర్.. కనీసం ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంకానున్నాడు. 
 
'శ్రేయస్‌కు విదేశాల్లో శస్త్రచికిత్స జరగనుంది. పూర్తిగా కోలుకోవడానికి అతడికి కనీసం అయిదు నెలలు పట్టొచ్చు' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. జూన్‌ 7న ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా శ్రేయస్‌ దూరమవుతాడు. అతడు గాయం వల్ల బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ఆఖరి టెస్టులో ఆడలేకపోయాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌ నుంచి కూడా వైదొలిగాడు. శ్రేయస్‌ గైర్హాజరీలో ఐపీఎల్‌లో కోల్‌కతాకు నితీశ్‌ రాణా నాయకత్వం వహిస్తున్నాడు.