మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (20:50 IST)

పంజాబ్ కింగ్స్ Vs కేకేఆర్ మ్యాచ్‌కు వర్షం.. గెలుపు ఎవరికో తెలుసా?

Punjab kings
Punjab kings
పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. మొహాలీలో భారీ వర్షం కురవడంతో.. ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 191 పరుగులు సాధించింది. 
 
అనంతరం, లక్ష్య ఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లలో  ఏడు వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అంతరాయం కలిగింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డీఎల్ఎస్ పద్ధతిలో విజేతను ప్రకటించారు. 
 
ఇకపోతే.. ఐపీఎల్‌లో నేటి రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు లక్నో ఆతిథ్యమిస్తోంది.