సురేశ్ రైనా బంధువులపై దోపిడీ.. మోస్ట్ వాంటెడ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా బంధువులు దోపిడీ దొంగల దాడిలో మృతి చెందిన ఘటన మూడేళ్ల క్రితం ఐపీఎల్ సందర్భంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రైనా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైనా మామయ్య అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపీడీ దొంగలు దాడి చేసారు. ఈ ఘటనలో అశోక్ కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, కుమారులు ఆస్పత్రి పాలయ్యారు.
కుమారుడు కౌశల్ చికిత్స పొందుతూ మరణించగా, భార్య, మరో కుమారుడు కోలుకున్నారు. ఈ కేసులో నిందితుడైన రషీద్‌ను పోలీసులు మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు.
గత మూడేళ్లుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యూపీలో రషీద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. రషీద్ పోలీసులపై దాడికి యత్నించడంతో, ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.