గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (13:33 IST)

భీమడోలు రైల్వేగేటు వద్ద ఘోర ప్రమాదం..

railway track
ఏపీలోని ఏలూరు భీమడోలు రైల్వేగేటు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని దూరంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టి.. ఐదు గంటలపాటు నిలిచిపోయింది.
 
గేటును ఢీకొట్టి బొలేరో వాహనం ట్రాక్‌పైకి రావడంతో ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్.. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. రైల్వే అధికారులు మరో ఇంజిన్ తీసుకొచ్చి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.