వైఎస్ వివేకా హత్య కేసు.. కొత్త సిట్ కోసం సుప్రీం ముందు ప్రతిపాదన
వైకాపా నేత వైఎస్ వివేకా హత్య కేసులో విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలని.. ఏప్రిల్ 30వ తేదీలోపు దర్యాప్తు ముగించాలని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇక దర్యాప్తు నుంచి ప్రస్తుత దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను తప్పించిన సీబీఐ.. కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు ముందు ప్రతిపాదన పెట్టింది.
కొత్త సిట్‌లో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీమతి, నవీన్ పూనియా, అంకిత్ యాదవ్ వున్నారు. ఇక సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ఈ కొత్త సిట్ పనిచేస్తుందని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.