మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (19:06 IST)

ఇంగ్లండ్ సీమర్ రీస్ టోప్లీకి గాయం.. ఐపీఎల్ 2023కి దూరం

Topley
Topley
ఇంగ్లండ్ సీమర్ రీస్ టోప్లీ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. భుజంలో ఏర్పడిన గాయం కారణంగా టీ-20 మెగా ఈవెంట్‌ నుంచి తప్పుకోనున్నాడు. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో జరిగిన టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనింగ్ గేమ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టోప్లీ కుడి భుజానికి గాయం అయ్యింది. 
 
టోప్లీ అరంగేట్రంలో తన రెండు ఓవర్లలో 14 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు, కామెరాన్ గ్రీన్‌ని అవుట్ చేశాడు, కానీ ఫీల్డ్‌లో డైవింగ్ స్టాప్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. దీంతో IPL 2023 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వేన్ పార్నెల్ టోప్లీ స్థానంలో ఎంపికయ్యాడు.