శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (13:50 IST)

టీమిండియా రాకుంటే క్రికెటేమీ అంతమైపోయినట్టు కాదు : పాక్ క్రికెటర్ హాసన్ అలీ

haasan aliవచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందులో భారత క్రికెట్ జట్టు ఆడుతుందా లేదా అన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుంది. అయితే, పాకిస్థాన్ క్రికెటర్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముఖ్యంగా, పాక్ క్రికెటర్ హాసన్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు లేకుండానే ఆడేందుకు తాము సిద్ధమయ్యామన్నారు. 
 
"మేము (పాకిస్థాన్) భారత్ వెళ్లి ఆడినప్పుడు.. వారు కూడా పాకిస్థాన్ రావాలి కదా. చాలా మంది భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌లో ఆడాలని కోరుకుంటున్నట్టు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే ఆటగాళ్లు వారి దేశ విధానాలను, దేశాన్ని, క్రికెట్ బోర్డును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది" అని హసన్ అలీ పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. 
 
భారత్ లేకుండా టోర్నీ ఆడటంపై ప్రశ్నించగా హసన్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది అంటే, మ్యాచ్‌లన్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతాయని అర్థం. పీసీబీ చైర్మన్ కూడా ఇదే చెప్పారు. కాబట్టి భారత్ జట్టు మా దేశానికి రాకూడదనుకుంటే వాళ్లు లేకుండానే టోర్నీ ఆడతాం. భారత్ పాల్గొనకపోతే క్రికెటేమీ అంతమైపోయినట్టు కాదు' అని వ్యాఖ్యానించాడు.