1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 మార్చి 2015 (15:46 IST)

వాళ్లు రాణించినప్పుడే నేను అత్యుత్తమ కెప్టెన్‌లా కనిపిస్తా: ధోనీ

ధోనీకి తలనొప్పిలా పరిణమించిన బౌలింగ్ విభాగం ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి ఎవరైనా ఆలౌట్ చేయడమే లక్ష్యమన్నట్టు చెలరేగిపోతున్న షమీ, యాదవ్, అశ్విన్ తదితరులను చూసి ధోనీ మురిసిపోతున్నాడు. తాజాగా, మీడియాతో మాట్లాడుతూ, తాను విజయవంతం అవడం వెనుక బౌలర్లది కీలకపాత్ర అని అన్నాడు.
 
వాళ్లు రాణించినప్పుడే తాను అత్యుత్తమ కెప్టెన్‌లా కనిపిస్తానని నిజాయతీ ప్రదర్శించాడు. బౌలర్లు ప్రణాళికకు అనుగుణంగా రాణిస్తూ తన పని సులువు చేస్తున్నారని కొనియాడాడు. అలా బౌలింగ్ చేయి, ఇలా బౌలింగ్ చేయి... అని చెబుతూ ఉంటే వారిపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్ నుంచి బౌలర్లు గుణపాఠాలను చాలా త్వరగా నేర్చుకున్నారని పేర్కొన్నాడు.