ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 31 మే 2015 (16:01 IST)

సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతా: కపిల్ దేవ్

భారత క్రికెట్ జట్టు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతానని భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ పలు విషయాలపై తన అభిప్రాయం వెల్లడించాడు. ఆ సమయంలో ప్రత్యేకించి ఆయన సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. 
 
గట్టి ప్రత్యర్థి ఉంటేనే బాగా ఆడగలమని చెప్పిన కపిల్, సెహ్వాగ్ చెత్త బంతిని ఎలాగూ వదలడు, మంచి బంతిని కూడా షాట్ కొట్టగల సమర్థుడంటూ పొగిడాడు. ఐదు ఓవర్లు మెయిడెన్ ఆడేవాడికి బౌలింగ్ చేసినా, చేయకున్నా ఒకటేనని, కసిగా బంతి సంధించినప్పుడు అంతకంటే కసిగా బంతిని బౌండరీ లైన్ దాటించే ఆటగాడికి బౌలింగ్ చేయడంలో ఉండే మజాయే వేరని కపిల్ అభిప్రాయాన్ని వెల్లడించాడు.