గురువారం, 14 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (14:54 IST)

అండర్-19 ప్రపంచకప్: వికెట్ పడకుండా పపువాపై భారత్ ఘనవిజయం

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. పపువా న్యూగినియాపై భారత్ పది వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా అండర్ -19 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా రెండోసారి విజయం సాధించినట్లైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా జట్టు, భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఫలితంగా పపువా న్యూగినియా 21.5 ఓవర్లలో 64 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ స్వల్ప పరుగుల లక్ష్యాన్ని 8 ఓవర్లలో వికెట్ పడకుండా భారత జట్టు అవలీలగా చేధించింది. 
 
భారత బ్యాట్స్‌మెన్లలో అర్థశతకంతో పృథ్వీషా తన సత్తా చాటాడు. 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో అనుకూల్ రాయ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. శివమ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, నాకర్‌కోటి, అర్షదీప్‌లు తలో వికెట్ సాధించారు. ఇక ఈ నెల 19న భారత జట్టు జింబాబ్వే జట్టుతో ఢీకొననుంది.