1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (14:55 IST)

భారత్ - బంగ్లాదేశ్ వన్డే మ్యాచ్ : టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా కెప్టెన్

india vs bangladesh
ఐసీసీ వన్డే క్రికెట్ టోర్నీలోభాగంగా, గురువారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ పూణె వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు టాస్ నెగ్గింది. ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న భారత్‌కు ఈ మ్యాచ్ తేలికగానే కనిపించినా బంగ్లా కుర్రోళ్లను అంత తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. 
 
బంగ్లా టాస్ నెగ్గడంతో ఓపెనర్లుగా లిటన్ దాన్స, తల్జిద్ క్రీజ్‌లోకి వచ్చారు. మొదటి ఓవర్‌ బుమ్రా ప్రారంభించాడు. తొలి ఎనిమిది ఓవర్లు ముగిసే సమయానికి బంగ్లా జట్టు వికెట్ నష్టపోకుండా 37 పరుగులు  చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ ఓపెనర్లు మాత్రం బౌండరీలతో పరుగులు రాబడుతున్నారు.
 
ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్ : రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, కుల్దీప్ యావద్, సిరాజ్.
 
బంగ్లాదేశ్ : హాసన్, లిటన్ దాస్, హాసన్ మిరాజ్, హుసైన్ షాంటో, రహీం, హృదయ్, మొహ్మదుల్లా, అహ్మద్, రహ్మాన్, ఇస్లామ్, హాసన్ మహ్మద్.