శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (17:34 IST)

మూడో వన్డే మ్యాచ్ : ఆస్ట్రేలియా భారీ స్కోరు - భారత్ టార్గెట్ 353 రన్స్

auses batsman
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 353 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. 
 
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో మూడో వన్డే మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో కంగారులు ఉన్నారు. ఫలితంగా టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 
 
డేవిడ్ వార్నర్ 56, మిచెల్ మార్ష్‌లు తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ 74, మార్నస్ 72, క్యారీ అలెక్స్ క్యారీ 11, కుమ్మిన్స్ 19 చొప్పున పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ టీమిండియా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని బౌండరీల వర్షం కురిపించారు. మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. కుల్దీప్ బౌలింగ్‌లో మార్ష్ అవుటయ్యాడు. వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు.
 
వన్ డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా దూకుడుగా ఆడడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్మిత్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 74 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 40 ఓవర్లలో 5 వికెట్లకు 286 పరుగులు కాగా... 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది.