ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఐపీఎల్ ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లు
స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2016 టోర్నీ మ్యాచ్‌లకు మహారాష్ట్రలో నెలకొన్న కరవు అడ్డంకిగా మారింది. దీంతో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మ్యాచ్‌లన్నింటినీ మే నెల ఒకటో తేదీ తర్వాత వేరే చోటికి తరలించాలని బాంబే హైకోర్టు విస్పష్ట ఆదేశాలను జారీచేసింది. ఈ తీర్పుతో పలు మ్యాచ్‌లను వేరే చోటికి తరలించారు.
ఈ పరిస్థితుల్లో శుక్రవారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మ్యాచ్ వేదికలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లను ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లాలో నిర్వహించాలని తీర్మానించింది. అలాగే, పుణె సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వైజాగ్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకుంది.