సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మే 2018 (10:04 IST)

ఐపీఎల్ 2018 : నేడు తొలి క్వాలిఫయర్ మ్యాచ్.. చెన్నై - హైదరాబాద్ ఢీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పదకొండో అంచె పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా, క్వాలిఫయర్ మ్యాచ్‌లలో భాగంగా, మంగళవారం రాత్రి తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పదకొండో అంచె పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా, క్వాలిఫయర్ మ్యాచ్‌లలో భాగంగా, మంగళవారం రాత్రి తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకే ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన టీమ్… ఫైనల్ ఫైట్‌కు అర్హత సాధించేందుకు ఎలిమినేటర్ మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఉంటుంది.
 
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టును చెన్నై జట్టు లీగ్ దశలో రెండు సార్లు చిత్తుగా ఓడించింది. దీంతో సూపర్ కింగ్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ జట్టు కుర్రోళ్లు ఉవ్విళ్ళూరుతున్నారు. రెండు జట్లలో సీనియర్స్‌తో పాటు యువ ఆటగాళ్లు ఆల్ రౌండ్ షోతో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇకపోతే, లీగ్ దశలో చెన్నైపై రెండు మ్యాచ్‌ల్లో ఓడటంతో పక్కా ప్రణాళికతో ఎలిమినేటర్ వన్‌కు హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సిద్ధంగా ఉన్నాడు. గెలుపు కోసం అవసరమైతే మార్పులకూ సిద్ధమవ్వాల్సిందేనని జట్టు సభ్యులకు సమాచారం చేరవేశాడు. 
 
చెన్నై టీమ్‌లోని బ్యాటింగ్‌లో అంబటి రాయుడు, ధోనీ, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవోలు కీలకం కాగా, సన్ రైజర్స్ జట్టులో కేన్ విలియమ్సన్, ధావన్, మనీష్ పాండే, గోస్వామి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే బౌలింగ్‌లో మాత్రం చెన్నైతో పోలిస్తే… రైజర్స్ టీమ్ మెరుగ్గా ఉంది.