శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : సోమవారం, 21 మే 2018 (14:53 IST)

ధోనీ మ్యాజిక్ బాగా పనిచేసింది... పంజాబ్‌పై చెన్నై గెలుపు.. జీవాతో ఆడుకుంటూ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెరుగ్గా రాణిస్తోంది. ఈ సీజన్ ప్రారంభంలో జోరు చూపించి.. ఆపై వరుస ఓటములతో కుంగిపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. చెన్నైతో జరిగిన మ్యా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెరుగ్గా రాణిస్తోంది. ఈ సీజన్ ప్రారంభంలో జోరు చూపించి.. ఆపై వరుస ఓటములతో కుంగిపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. భారీ స్కోరు సాధింస్తుందనుకున్న పంజాబ్ కేవలం 153 పరుగులకే పరిమితం కావడం ద్వారా ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
 
ఇక ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ విజయంతో ప్లే ఆఫ్ కు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న ధోనీ జట్టు, 154 పరుగుల కష్టసాధ్యం కాని విజయలక్ష్యంతో బరిలోకి దిగగా, ఆద్యంతం ధోనీ తన మాయాజాలాన్ని చూపించాడు. బ్యాట్స్‌మన్లను కాకుండా, బౌలర్లు భజ్జీ, దీపక్ చాహర్‌లను పంపి.. పక్కాగా మ్యాచ్ గెలిపించాడు. వీరిద్దరి షాట్లకు నెమ్మదిగా మ్యాచ్‌ను కోల్పోయింది. 
 
హర్భజన్ 19, దీపక్ 39 పరుగులు చేశారు. మరో ఎండ్‌లో నిలకడగా రైనా ఉండగా, జట్టు స్కోరు 100 దాటింది. చెన్నై చేసిన పరుగులు 100 దాటగానే పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. ఆపై ఆ జట్టు బౌలర్లు కూడా పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. రైనా 61 నాటౌట్, ధోనీ 16 నాటౌట్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు.
 
సోమవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగనుండగా, తొలి మ్యాచ్ టాప్-2 స్థానాల్లో ఉన్న హైదరాబాద్ సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య (క్వాలిఫయర్ మ్యాచ్) జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ప్లేఆఫ్‌లో భాగంగా మంగళవారం ధోనీ సేన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబయిలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.
 
మరోవైపు మ్యాచ్‌ అనంతరం అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం జరుగుతోన్న సమయంలో మైదానంలో  ధోనీ తన గారాలపట్టీ జీవాతో కలిసి సరదాగా ఆడుకుంటూ కనిపించాడు. ఆ సమయంలో జీవా తన తండ్రి ధోనీ తలపై ఉన్న టోపీ తీయడం ఆ తర్వాత పెడుతూ కనిపించింది. మైదానంలో జీవా ఆనందంతో గెంతులేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.