గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2020 (11:38 IST)

పంజాబ్‌కు చుక్కలు చూపించిన ముంబై.. బౌలర్లు గెలిపించారు..

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 48 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది . పంజాబ్​​ బ్యాట్స్​మెన్​ దారుణంగా విఫలమయ్యారు. నికోలస్​ పూరన్​(44) టాప్​ స్కోరర్​. మయాంక్​(25), గౌతమ్​(22) పరుగులు చేశారు. బుమ్రా, చాహర్​, ప్యాటిన్సన్​ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబై 20 ఓవర్లకు 191/4 పరుగులు చేసింది. రోహిత్​(70) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో పొలార్డ్​(47*), హార్దిక్​ పాండ్యా(30) చెలరేగి ఆడారు. షమీ, గౌతమ్​, కాట్రెల్​ తలో వికెట్​ తీశారు.
 
ముంబై ఇండియన్స్​ లెగ్​ స్పిన్నర్​ క్రునాల్​ పాండ్యా వేసిన బంతికి కరుణ్​ నాయర్​(0) డకౌట్​గా వెనుదిరిగాడు. ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్​ 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజ్​లో కేఎల్​ రాహుల్​, పూరన్​లు ఉన్నారు.
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కింగ్స్‌ పంజాబ్‌ను ముంబై బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఫామ్‌లో ఉన్న మాయంక్‌ అగర్వాల్‌(25), కేఎల్‌ రాహుల్‌(17)లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు. ఒక్క నికోలస్‌ పూరన్ ‌(44; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించాడు. 
 
చివర్లో గౌతమ్‌(22 నాటౌట్‌; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో బ్యాట్‌ ఝుళిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులే మాత్రమే చేసి మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
 
ముంబై బౌలర్లలో బుమ్రా, పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బౌల్ట్‌, కృనాల్‌ పాండ్యా తలో వికెట్‌ తీశారు. ఇదిలావుంటే శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.